“నా అనుభవాన్ని అంతటిని ఒక పుస్తకంగా రాశాను” - ప్రసాద్ కైప | Smart To Wise- 1
Description
ప్రసాద్ కైప ప్రతిష్టాత్మక ఐఐటిలో ఉన్నత చదువు తర్వాత అమెరికాలో యాపిల్ సంస్థలో చేరారు. ఆ సంస్థ ఎదుగుదలలో భాగస్వాములయ్యారు. ఉద్యోగిగా, వ్యవస్థాపకునిగా… సిలికాన్ వ్యాలీలో ఉన్న పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. సాంకేతిక విప్లవానికి వేదికగా ఉన్న ఆ ప్రాంతంలో ఎందరో సామాన్యులు విజేతలుగా ఎదిగారు. అసమాన్యులు పరాజితులయ్యారు. ఓ వ్యక్తి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, సంస్థను స్థాపించడం గొప్ప కాదనీ… దాన్ని విజయవంతంగా నడిపించడం, ఎదురైన ప్రతి సవాలునీ అధిగమించడమే తన నాయకత్వానికి పరీక్ష అనీ గ్రహించారు ప్రసాద్. చురుగ్గా కాదు, తెలివిగా ఉండాలని విశ్లేషించారు. తన దశాబ్దాల అనుభవాలకు… భారతీయ చింతన, ఎందరో సిఇఒల ప్రయాణాలను జోడించి Smart To Wise అనే పుస్తకాన్ని రాశారు. కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ పుస్తకం ఆధారంగా మొదలైన సిరీస్ ఇది. తొలి ఎపిసోడ్లో, పుస్తకం రాయడం వెనుక ఉన్న ప్రేరణ, కారణాలను ఆసక్తికరంగా పంచుకుంటున్నారు ప్రసాద్ కైపగారు.
Prasad Kaipa is renowned for his mentorship. Numerous CEO’s has benefited from his guidance filled with practical knowledge and age old Indian though process. Having stayed for decades together in the Silicon Valley, Prasad Kaipa has observed the drastic difference between being Smart and being Wise… which has often dictated the fate of numerous entrepreneurs. With his keen observation backed by numerous journeys of CEO’s… he has written the book Smart To Wise which has become a sensation in the corporate world. Here is a brand new series based on the book. The first episode deals with the story behind the writing of the book.
Host : Rama Iragavarapu
Expert : Prasad Kaipa
#TALRadioTelugu #prasadkaipa #smarttowise #touchalife #talradio #talpodcasts